తీరైన ఆకృతి కోసం
- తీసుకునే ఆహరం లో తృణ దాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రాగులు,జొన్నలు,ఓట్స్ లలో తక్కువ కేలోరిలు ఉంటాయి.బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎక్కువగా తీసుకోవటం మంచిది.
- పొట్ట వలన మదుమేహం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని స్పానిష్ వైద్య నిపుణులు ఓ అద్యనంలో వెల్లడించారు. ఇందుకు మనం తీసుకునే ఆహారంలో కార్బో హైడ్రేడ్లు ముఖ్య కారణం. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది.భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు నివారించాలి అంటే ఆలివ్ నూనె ను తరుచు ఉపయోగించాలి.
- నీళ్ళు ఎక్కువగా తాగాలి.నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తరుచూ తీసుకోవాలి.ముఖ్యంగా దోసకాయ,బొప్పాయి, పుచ్చ కాయ, నారింజ, సొరకాయ, బీరకాయ వంటివి తరచూ తీసుకుంటే నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.
- ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోగలిగితే నడుము చుట్టూ కొవ్వు పెరుకోదు.
- తరచూ గ్రీన్ టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుందని.. సుమారు 500 మంది మహిళల ఫై జపాన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
No comments:
Post a Comment